బౌద్ధ విజ్ఞానం-లౌకిక జీవనం (Telugu)

బౌద్ధ విజ్ఞానం-లౌకిక జీవనం – సామాజిక శాస్త్ర పరిశోధకునిగా కొంత జాతీయ స్థాయి పెద్దలతో పరిచయం వున్న నాకు యిప్పుడు బౌద్ధం ఒక ప్రత్యేక తెగలాగ, అందులో కులసమూహ సామాజిక (ఒకనొక భేషజాల) పరిమితులకు లోనయిపోతుందనే వేదన కలిగింది. వ్యక్తి ఆరాధన ఛాయలు కోకొల్లలు. నేను బౌద్ధ పండితుడను కానప్పటికీ, బౌద్ధం జీవన విధానంగా ఒక సామాజిక ‘ఉద్యమంగా రూపొంది దేశంలో సాంస్కృతిక చైతన్యం తద్వారా మార్పు రావాలని ఆశించే వాళ్ళలో నేనూ ఒక్కణ్ణి, నిజానికి బౌద్ధం బ్రతికున్నంత కాలం ఒక దశలో వర్ణ వ్యవస్థ వ్యాప్తి జరగలేదు. అందుకే బౌద్ధంపై నా స్పందనగా యీ చిన్న ప్రయత్నం. — ఆచార్య కె. ఎస్. చలం